అసెంబ్లీ ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం.. తమిళనాడు, బెంగాల్ లో..
x
తమిళనాడు: ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళలు

అసెంబ్లీ ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం.. తమిళనాడు, బెంగాల్ లో..

హోరాహోరీ పోరు తప్పదని సంకేతాలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీకి.. బెంగాల్ అసెంబ్లీ తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 4,023 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నేడు 5.73 కోట్ల మంది పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఇందులో 3.60 కోట్ల మంది ఓటర్లు 1,452 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్ లోని ఉమ్రేత్ అసెంబ్లీ ఉప ఎన్నికకు, మహారాష్ట్రలోని బారామతి, రాహురీ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5.30 నిమిషాలకు వరకూ కొనసాగుతుంది. మే 4 ఫలితాల వెల్లడిస్తారు.

డీఎంకేతో ఎన్డీఏ హోరాహోరీ..

తమిళనాడులో పోరు ఆసక్తికరంగా ఉంది. డీఎంకే కూటమితో ఎన్డీఏ హోరాహోరీగా తలపడుతోంది. డీఎంకే కూటమిలో ఎస్పీఏ, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏల మధ్య సాగుతోంది. డీఎంకే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండోసారి అధికారం చేపట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదేళ్ల ప్రతిపక్షం నుంచి తిరిగి అధికారం దక్కించుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఉవ్విళ్లురుతున్నాడు. అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే కూడా పోటీలో ఉండటంతో ఆయన చీల్చబోయే ఓట్లు డిసైడింగ్ ప్యాక్టర్ గా ఉండబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
‘‘రాష్ట్రంలో 5.73 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2.93 కోట్లు, 2.83 కోట్ల మంది పురుషులు ఉన్నారు. 7,728 మంది తృతీయ జెండర్ వ్యక్తులు ఉన్నారు’’ అని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు.
ఇందులో తొలిసారి ఓటు వేసేవారు 14,59,039 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం కమిషన్ 1,06,418 బ్యాలెట్ యూనిట్లతో పాటు 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేసింది. ఎన్నికల భద్రత కోసం 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించింది.

పశ్చిమ బెంగాల్..

పశ్చిమ బెంగాల్, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్ లో ఉన్న 16 జిల్లాలో ఉన్న 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ‘సర్’ తో ఓటర్ల సంఖ్య 12 శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. తొలి దశలో 3.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1.75 మంది మహిళలు పేర్కొన్నారు. ఎన్నికల కోసం మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్ పూర్, కూచ్ బెహార్, బీర్భూమ్, పూర్భ బర్ధమాన్ వంటి జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

Live Updates

  • 23 April 2026 8:16 PM IST

    బెంగాల్ లో పోలింగ్ ఇలా ముగిసింది:

     పశ్చిమ  బెంగాల్‌లోని 152 అసెంబ్లీ స్థానాల్లో గురువారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూలలో వేచి ఉన్నవారిని మాత్రం ఓటు వేసేందుకు  సాయంకాలం ఆరు తర్వాత కూడా అనుమతిస్తున్నారు.

     నిర్ణీత సమయం కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 3.60 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 90 శాతం మంది ఓటు వేశారు. రాష్ట్ర ఇటీవలి ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక ఓటింగ్ శాతం.

    రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలున్నాయి. ఇపుడు 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. రంగంలో  167 మంది మహిళలతో సహా 1,478 మంది అభ్యర్థులున్నారు.  వారి భవితవ్యాన్ని తేల్చేందుకు, గురువారం ఉదయం 7 గంటలకు 16 జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది.

    అధికార  తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో బెంగాల్ రాజకీయాలకు కీలకమైన మలుపు కానుంది.  ఈ ఎన్నికలలో, పోలింగ్ బూత్‌ల బయట కనిపించిన పొడవైన క్యూలు ఓటర్లు ఈ ఎన్నిక మీద ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతుంది.

    సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 89.93 శాతం ఓటింగ్ నమోదు కాగా, 93.12 శాతం పోలింగ్‌తో దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా అగ్రస్థానంలో ఉంది.

    పలు నియోజకవర్గాల్లో ఘర్షణలు, బెదిరింపుల ఆరోపణలు, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులతో సహా ఇతర అభ్యర్థులపై దాడులు జరిగినట్లు నివేదికలు రావడంతో, పోలింగ్ "చాలా వరకు శాంతియుతంగా" జరిగిందని పేర్కొంటూనే, ఎన్నికల సంఘం వివరణాత్మక నివేదికలను కోరింది. 

  • 23 April 2026 8:12 PM IST

    బెంగాల్ లో పోలింగ్ సిబ్బంది సస్పెన్షన్ :

    బెంగాల్‌లోని పింగ్లాలో పోలింగ్ సమయంలో బూత్‌ను పర్యవేక్షణ లేకుండా వదిలిపెట్టినందుకు పోలింగ్ సిబ్బంది అందరినీ ఈసీ సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా పింగ్లా అసెంబ్లీ నియోజకవర్గంలో, ఓటింగ్ సమయాలలో పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షణ లేకుండా వదిలిపెట్టారనే ఆరోపణల నేపథ్యంలో, ఆ బూత్‌లోని పోలింగ్ సిబ్బంది అందరినీ ఎన్నికల సంఘం గురువారం సస్పెండ్ చేసిందని ఒక అధికారి తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు, నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారిని కమిషన్ ఆదేశించింది.

  • 23 April 2026 8:10 PM IST

    స్టాలిన్ నియోజకవర్గంలో పోలింగ్ ఎంతో తెలుసా?

    సాయంకాలం 5 గంటలకు ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో 83.58% పోలింగ్ నమోదు కాగా, విజయ్ బరిలో ఉన్న పెరంబూర్‌లో 86.72% పోలింగ్ నమోదైంది.

    ఎడప్పాడి కె. పళనిస్వామికి చెందిన ఎడప్పాడి నియోజకవర్గంలో 89.09 శాతం, తిరుచ్చి తూర్పు (విజయ్)లో 79.32 శాతం, ఉదయనిధి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెపాక్-తిరువల్లికేణిలో 81.89 శాతం పోలింగ్ నమోదైంది

  • 23 April 2026 8:09 PM IST

    తమిళనాడు పోలింగ్ చారిత్రాత్మకం:

    తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్  సాయంత్రం 6 గంటలకు ముగిసే సరికి చరిత్ర సృష్టించింది. చారిత్రాత్మకంగా 84.29% ఓటింగ్ నమోదైంది. 2021 ఎన్నికలలో 6.29 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య 2026 నాటికి 5.73 కోట్లకు పడిపోయినప్పటికీ, ఈసారి ఎక్కువ మంది ఓటు వేయడానికి వచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఇప్పటికే 4.71 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఇది 2021 లో  4.63 కోట్ల మంది ఓటేశారు. అంటే ఈ సారి పోలింగ్ గణనీయంగా పెరిగిందన్నమాట.

  • 23 April 2026 5:51 PM IST

    తమిళనాడు రికార్డు పోలింగ్ :

    సాయంత్రం 5 గంటల సమయానికి 82.24% ఓటింగ్ నమోదైంది; సాయంత్రం 6 గంటలలోపు ఓటు వేయాలని చెన్నై వాసులకు ఈసీఐ విజ్ఞప్తి చేసింది. కొద్ది సేపటిలో పోలింగ్ ముగియనుంది. పోలింగ్ కేంద్రాలు సాయంత్రం 6 గంటలకు కచ్చితంగా మూసివేయబడతాయని, అప్పటికే ప్రాంగణంలో ఉన్నవారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

  • 23 April 2026 5:48 PM IST

    బెంగాల్ రికార్డ్ పోలింగ్ అప్డేట్:

    సాయంత్రం 5 గంటల వరకు పశ్చిమబెంగాల్ లో  89% పైగా ఓటింగ్ నమోదైంది.

    ఇప్పటి వరకు అందిన వివరాలు:

    అలీపుర్దువార్: 88.74 శాతం

    బంకురా: 89.91 శాతం

    బీర్భూమ్: 91.55 శాతం

    కూచ్ బెహార్: 92.07 శాతం

    దక్షిణ దినాజ్‌పూర్: 93.12 శాతం

    డార్జిలింగ్: 86.49 శాతం

    జల్పైగురి: 91.20 శాతం

    ఝార్గ్రామ్: 90.53 శాతం

    కాలింపాంగ్: 81.98 శాతం

    మాల్దా: 89.56 శాతం

    ముర్షిదాబాద్: 91.36 శాతం

    పశ్చిమ బుర్ద్వాన్: 86.89 శాతం

    పశ్చిమ మిడ్నాపూర్: 90.70 శాతం

    తూర్పు మిడ్నాపూర్: 88.55 శాతం

    పురూలియా: 87.35 శాతం

    ఉత్తర దినాజ్‌పూర్: 89.74 శాతం

  • 23 April 2026 5:46 PM IST

    కోల్ కతా బిజెజి ‘వార్ రూమ్’ లో అమిత్ షా

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఇక్కడి సాల్ట్ లేక్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉన్న 'వార్ రూమ్'ను సందర్శించారు.  రాష్ట్రంలో పార్టీ ప్రచారాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్న షా, ఉదయం 'వార్ రూమ్'కు చేరుకుని, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి సీనియర్ బీజేపీ నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • 23 April 2026 5:35 PM IST

    బెంగాల్ లో గొడవ

    పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో మొదటి దశ పోలింగ్ చివరి గంటల్లో ఈవీఎంలు పనిచేయడం లేదనే ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ విషయం మీద ఖరిసాల్ ప్రాంతంలో స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

     దుబ్రాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒక పోలింగ్ బూత్‌లో ఈ గొడవ మొదలైందని, అక్కడ టీఎంసీకి పడిన ఓట్లను బీజేపీకి నమోదు చేస్తున్నారని ఓటర్లు ఆరోపించినట్లు వారు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫిర్యాదులు రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు ఓటింగ్‌ను నిలిపివేశారు, దీంతో బూత్ వెలుపల నిరసనలు చెలరేగాయి. పోలింగ్ అధికారులకు, ఆందోళనలో ఉన్న ఓటర్లకు మధ్య వాగ్వాదం చెలరేగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్థానికులలో ఒక వర్గం బూత్ బయట గుమిగూడి ప్రదర్శనకు దిగింది. కేంద్ర బలగాలతో సహా భద్రతా సిబ్బంది గుంపును చెదరగొట్టడానికి జోక్యం చేసుకోవడంతో, ఘర్షణలు చెలరేగాయి.

  • 23 April 2026 5:33 PM IST

     డీఎంకే కి స్పష్టమైన మెజారిటీ: వైకో

    ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎండీఎంకే అధినేత వైకో అన్నారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైకో గురువారం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కూటమి 200కు పైగా సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.

  • 23 April 2026 3:44 PM IST

    రికార్డు స్థాయిలో పోలింగ్: 

    తమిళనాడు, పశ్చిమబెంగాల్ లలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదవూత ఉంది. మధ్యాహ్నమూడున్నరకే  70  శాతం దాటింది.తమిళనాడులో70 శాతం చేరితే, బెంగాలలో  78.77 శాతానికి చేరింది. గతంలో పోలింగ్ ఇలా ఉండింది. ఒంటిగంటకు పోలింగ్ హిస్టరీ

    2016 - 42.10% - 2.45cr votes

    2019 - 39.49% - 2.36cr votes

    2021 - 39.61% - 2.48cr votes

    2024 - 39.51% - 2.46cr votes

    2026 - 56.81% - 3.25cr Votes

Read More
Next Story